కాచిగూడ పోలీస్ ల ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్

1 min read

హైదరాబాద్ కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుందర్ నగర్ లో కాచిగూడ పోలీస్ ల ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాచిగూడ జోన్ ఏసిపి సుధాకర్ పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 150 మంది పోలీస్ సిబ్బంది కార్టన్ సెర్చ్ లో పాల్గొన్నారనీ, ఈ తనిఖీలలో సరైన ధ్రువపత్రాలు లేని వాహనాల తో పాటు, పెండింగ్ ట్రాఫిక్ చలాన్ లు  ఉన్న 29 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారనీ తెలిపారు. ఈ సందర్భంగా కాచిగూడ జోన్ ఏసిపి సుధాకర్ బస్తీ ప్రజలతో సమావేశమయ్యారు. ఆయన వారితో మాట్లాడుతూ, సీసీ కెమెరాల ఆవశ్యకత గురించి తెలిపారు. నేను సైతం కార్యక్రమం లో ప్రజలు మమేకమై సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునే విధంగా వారినీ కోరారు. అందుకు ప్రజలు, బస్తి వాసులు సీసీ కెమెరాల కెమెరాల ఏర్పాటుకు సానుకూలంగా స్పందించారు. ఈ కార్టన్ సెర్చ్ వల్ల ప్రజలకు పోలీసులకు మధ్య స్నేహపూర్వక సంబంధాలు నెలకొంటాయని, అనుమానస్పద వస్తువులు . గాని అనుమానం ఉన్న వ్యక్తులు సంచరిస్తే వెంటనే వంద నెంబర్ కు చేయాలని, లేదా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఏ సి పి సుధాకర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *