64 people fined for not wearing mask – charan news
1 min read
హోమ్ క్వారంటైన్ ఉల్లంగిస్తే జైలుకే - charan news
64 people fined for not wearing the mask
హోమ్ క్వారంటైన్ ఉల్లంగిస్తే జైలుకే
జగిత్యాల: జిల్లాకు ఇతర రాష్ట్రాలనుండి వచ్చినవారు హోమ్ క్వారంటైన్ ఉలంగిస్తే కేసులు నమోదు చేసి జైలుకు పంపాలీసి వస్తుంది అని జిల్ల్లా ఎస్పీ సి. హెచ్. సింధుశర్మ పేర్కొన్నారు. జిల్లా కు మహారాష్ట్ర నుంచి ముఖ్యంగా ముంబై నుంచి ఎక్కువ మంది వలస కార్మికులు చేరుకున్నారని వారంతా 28 రోజుల పాటు ఇళ్లలోనే ఉండాలని ఎవరైనా బయటకు వస్తే కేసు నమోదు చేస్తామన్నారు. ఇప్పటి వరకు 30 మంది పై కేసు నమోదు చేసినట్టు చెప్పారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు ప్రతి ఒక్కరూ కచ్చితంగా మాస్కు ధరించాలని లేనట్లయితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. గత రెండు రోజులలో మాస్క్ ధరించని 64 మందికి రూ. వెయ్యి చొప్పున జరిమానా విధించామని ప్రజలు రహదారులపై ఇష్టానుసారంగా తిరగవద్దని అన్ని ప్రాంతాల్లో పొలిసు నిఘా ఉంటుందని ఎస్పీ పేర్కొన్నారు.