ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పెద్ద అంబర్ పేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం

1 min read

ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పెద్ద అంబర్ పేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం… హాజరైన భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డివెంకటరెడ్డి,మల్ రెడ్డి రంగారెడ్డి ఇతర ముఖ్య నాయకులు

కోమటిరెడ్డివెంకటరెడ్డి: కేసీఆర్,కేసీఆర్ కుటుంబం 2 లక్షల కోట్ల అవినీతికి పాల్పడింది. కేసీఆర్ జైల్ కు పోతే తిరిగి మళ్ళీ రాడు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెల్పించండి. ప్రజల సమస్యలను పరిష్కరించడానికి నిరంతరం ప్రజలతో ఉంటారు. కేంద్రం నుండి నిధులు తీసుకవచ్చి మునిసిపాలిటీలను అభివృద్ధి చేస్తాం. 2 సంవత్సరలో మూసి ని ప్రక్షాళనం చేస్తాం. మూసి ప్రక్షాళన కోసం ప్రధాని మోడీని నిధులు కేటాహించమని విజ్ఞప్తి చేసాను. మిగులు బడ్జెట్ తో ఉన్న తెలంగాణ ను లోటు బడ్జెట్ గా కేసీఆర్ మార్చారు. తెలంగాణ దుర్మార్గుడు కేసీఆర్. కేసీఆర్ అనాలోచిత నిర్ణయం వల్ల ఆర్టీసీ ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు. పేద ప్రజలు మీద కేసీఆర్ కు ప్రేమ లేదు. ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్ దోచుకుంటు, మైహోం రమేశ్వర్ రావు కు దోచిపెడుతున్నారు. మనిషి రూపంలో ఉన్న రక్షసుడు కేసీఆర్. కాళేశ్వరం కు 2 లక్షల కోట్లు పెడుతున్న కేసీఆర్ మూసి ప్రక్షాళన కోసం 2 వేల కోట్లు ఖర్చు పెట్టావా. పేదలకు కేసీఆర్ ఇల్లులు కట్టిస్తా అని కట్టలే.స్థానికంగా మంచి ప్రజాప్రతినిధులు ఉన్నప్పుడు మంచిగా పనులు అవుతాయి.. నితిన్ గడ్కరీ ని ఆరుసార్లు కలిసా… ఎల్బీనగర్ నుండి హయత్ నగర్,పెద్ద అంబర్ పేట మీదగా ఆందోల్ మైసమ్మ గుడి వరకు ఎనిమిది లైన్ల. రోడ్డును కేంద్రం ప్రభుత్వం వెంటపడి తెచ్చా… రోడ్డుకు 360కోట్లు సాంక్షన్ చేపించా రెండు నెలల్లో టెండర్లను పిలిపించి రోడ్డును ప్రారంభింస్తున్నా..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *